ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: బొల్లారంలో ఆర్మీ ఆయుధాల చోరీ (Bollaram Arms Theft) కేసులో అరెస్టయిన మాజీ హవల్దార్ మల్లేశ్‌ను కస్టడీకి అనుమతి ఇస్తూ మల్కాజ్‌గిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బొల్లారం పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆయుధాల చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది.. ఎందుకు వాటిని దొంగలించాల్సి వచ్చిందనే అంశాలపై ప్రశ్నించబోతున్నారు. దర్యాప్తులో భాగంగా బొల్లారం పోలీసులతో పాటు ఆర్మీ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మల్లేశ్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన పోలీసులు.. డిలేట్ చేసిన డేటాను రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ వ్యక్తిని ఎందుకు కలిసినట్లు..?

ఆయుధాలను దొంగలించిన అనంతరం మల్లేశ్ సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అతను ఎవరు.. చోరీ చేసిన ఆయుధాలను సదరు వ్యక్తికి అప్పగించాలనుకున్నాడా.. మల్లేశ్‌కు ఎవరెవరితో లింకులు ఉన్నాయి.. ఉగ్ర నెట్‌వర్క్‌లో భాగమై.. ఇదంతా చేశాడా.. అనేది అనుమానిస్తున్నారు. మల్లేశ్ కస్టడీలో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read : యుద్ధాలకు చెక్ పెట్టేందుకు.. కేఏ పాల్ శాంతి సందేశం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>