శ్రీ విద్య సంప్రదాయంలో సమంత సీమంతం

కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సీమంతం వేడుక (Baby shower Ceremony) ఎంతో  సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీ విద్య సంప్రదాయంలో జరిగిన ఈ ప్రత్యేక వేడుకలో సమంత భర్త రాజ్ నిడిమోరు, సన్నిహిత స్నేహితులు పాల్గొన్నారు. వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను సమంత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుక తనకు, తన బిడ్డకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు సమంత తెలిపారు. భారతీయ సంప్రదాయాలపై తనకు ఎప్పటి నుంచో ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం తనకు పూర్తిగా తెలియకపోయినా.. వాటి వెనుక ఏదో ఒక లోతైన భావం, శక్తి ఉంటుందని తాను నమ్ముతానని పేర్కొన్నారు.

మంత్రాల ధ్వని, మంత్రోచ్చారణ ద్వారా ఏర్పడే శక్తి, తరతరాలుగా ఎంతో జాగ్రత్తగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన ఆచారాలు తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని సమంత వెల్లడించారు. ఈ సంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మికతను తాను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. సీమంతం వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో సమంత ఎంతో అందంగా కనిపించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>