బంగారు వినాయకుడు.. అరుదైన విగ్రహం ఎక్కడుందంటే..?

కలం, హైదరాబాద్ బ్యూరో : ఈసారి వినాయక చవితికి నగరంలోని ఓ జువెల్లరీ దుకాణం వినూత్న రీతిలో గణేశ్ విగ్రహాన్ని రూపొందించింది. చాలా భక్త సంఘాలు పర్యావరణం కోసం మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తే బేగంబజార్‌లోని లీచీ పెరల్స్ అండ్ జువెల్స్ అనే దుకాణం మాత్రం గోల్డెన్ అండ్ డైమండ్ గణేశ్ విగ్రహాన్ని (Golden Ganesha) నెలకొల్పింది.

పూర్తిగా 24 క్యారెట్ల బంగారం, అమెరికా వజ్రాలతో అటు ముంబైలోని గణేశ్ రూపం, ఇటు తిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఇమిటేషన్‌తో ఈ విగ్రహాన్ని రూపొందించింది. ఈ విగ్రహం తయారీ కోసం మొత్తం ఎంత బంగారాన్ని వాడిన సంగతిని నిర్వాహకులు వెల్లడించలేదు. కానీ అమెరికా నుంచి తెప్పించిన 3,83,800 డైమండ్లను వాడినట్లు మాత్రం పేర్కొన్నారు. ఈ విగ్రహం ప్రతిష్టించిన మండపానికి ‘లీచీ కా రాజా గణేశ్ ఉత్సవం పండల్’ అని పేరు పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>