కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ శనివారం రాత్రి బ్రిక్స్ సదస్సు(BRICS Summit)లో భాగంగా వివిధ దేశాధినేతల గౌరవార్థం భారీ విందు నిర్వహించారు. దీనికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినా.. జిన్ పింగ్ రాకపోవడంపై చైనా అధికారులు, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
ఇది కాస్తా వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు చైనా విదేశాంగ ప్రతినిధులు స్పందించారు. సుదీర్ఘ విమాన ప్రయాణం, ఢిల్లీ వచ్చిన వెంటనే సదస్సుల్లో పాల్గొనడం కారణగా జిన్ పింగ్ బాగా అలిసిపోయి హోటల్ రూంకే పరిమితమైనట్లు వివరించారు. టైమ్ జోన్లలో మార్పు కూడా మరో కారణమని తెలిపారు. అందుకే మోదీ విందుకు గైర్హాజరు అయ్యారని, వేరే కారణం లేదని స్పష్టం చేశారు.
ఒక్కొక్కరుగా తిరుగు ప్రయాణం..
బ్రిక్స్ సదస్సుకు వచ్చిన వివిధ దేశాల అధ్యక్షులు, విదేశాంగ మంత్రులు, ఇతర ప్రతినిధులు ఒక్కొక్కరుగా ఢిల్లీ నుంచి వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping), ఆ తరువాత రష్యా ప్రెసిడెంట్ పుతిన్ బయల్దేరారు. ప్రముఖుల తిరుగు ప్రయాణంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రద్దీగా మారింది. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటనతో బ్రిక్స్ సదస్సు ముగిసిన విషయం తెలిసిందే.
Also Read : 2,000 పరుగులు.. రూట్ అరుదైన రికార్డు!
Follow Us On : WhatsApp

