నిర్మల్​ లో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామ బైపాస్ వద్ద ఆదివారం పోలీసులు (Nirmal Police) ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు. పెండింగ్ చలాన్లను తనిఖీ చేసి జరిమానాలు వసూలు చేశారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో రూరల్ ఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>