కలం, సోన్ : సోన్ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద శ్రీరాంసాగర్ జలాశయం నుంచి సరస్వతి కాలువ (Saraswati Canal) ద్వారా ఖరీఫ్ పంటల సాగుకు 200 క్యూసెక్కుల నీటిని ఏఈఈ శ్యామ్ ఆదివారం విడుదల చేశారు. నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచందా, మామడ మండలాల పరిధిలోని రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అధికారులు సూచించారు.
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు కృషితో సరస్వతి కాలువకు సాగునీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేసిన అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

