గద్వాలలో ప్రేమ పెళ్లి వివాదం.. యువకుడి ఇంటి ధ్వంసం, ఏడుగురు అరెస్ట్!

కలం,‌ జోగులాంబ గద్వాల:  జోగలాంబ గద్వాల జిల్లా  రేపల్లి గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న (Gadwal Intercaste Marriage)  కారణంతో ఈనెల 10వ తేదీన పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి శనివారం సాయత్రం ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.

ఆలంపూర్ కోర్టుకు నిందితుల తరలింపు

క్రైమ్‌ నం.146/2026లో BNS సెక్షన్లు 191(2), 191(3), 333, 324(5), 49 ర/వ 190తో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్‌ నిరోధక) చట్టంలోని 3(1)(g), 3(2)(va) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో T. వీరన్న, పరశురాములు, పరుష , వెంకటేష్, T. వెంకటేష్ నాయుడు, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్న, తిమ్మప్పలను అరెస్టు చేశారు. నిందితులను ఆలంపూర్‌ JFCM కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి న్యాయ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>