కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్ నగరం తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. నిరసనల సమయంలో అల్లరిమూకలు చెలరేగిపోయాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను (Waymo Cars) ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. రోడ్లపై వెళ్తున్న ఈ డ్రైవర్‌రెస్ వాహనాల విండ్‌స్క్రీన్‌లను పగలగొట్టి, కార్లపై గ్రాఫిటీ రాసి, నిప్పు పెట్టారు.
ఒక్కో వేమో కారు (Waymo Cars) విలువ సుమారు 600,000 డాలర్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ నష్టం రూ.50 కోట్లకు పైగానే ఉంది. వీధుల్లో కార్లు దహనమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ దాడి ఘటనల నేపథ్యంలో వేమో యాజమాన్యం తక్షణమే స్పందించింది. ప్రయాణికులు, వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకుని లాస్ ఏంజిల్స్‌లో తమ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) శ్రమిస్తోంది. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించడానికి ఘటనా స్థలాల్లోని సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. లక్షల డాలర్ల విలువైన అధునాతన సాంకేతిక వాహనాలను ధ్వంసం చేయడంపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు వెల్లడించారు.
Also Read : పట్టాలు తప్పిన రైలు: 44 మందికి గాయాలు
Follow Us On: X(Twitter)

