కలం, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల (Tirumala Brahmotsavam) సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే కీలక ఘట్టమైన అంకురార్పణ రేపు రాత్రి ఆలయంలోని యాగశాలలో నిర్వహించనున్నారు. అంతకుముందు సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (Tirumala Brahmotsavam) భాగంగా ఎల్లుండి మధ్యాహ్నం మాడవీధుల్లో శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం ఉరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. స్వామివారి సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Also Read : పట్టాలు తప్పిన రైలు: 44 మందికి గాయాలు
Follow Us On : WhatsApp

