పట్టాలు తప్పిన రైలు: 44 మందికి గాయాలు

కలం, వెబ్ డెస్క్​ : ఉత్తర ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాంతంలో ఒక ప్రయాణికుల రైలు (France Train) ప్రమాదానికి గురైంది. రూయెన్ పట్టణం నుంచి కేన్‌ వైపు 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలు క్లియోన్ సమీపంలో హఠాత్తుగా పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 44 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఒక మహిళ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, అధికారులు వెంటనే ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

రైలు పట్టాలపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఒక లోహపు వస్తువును ఉంచడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న రైలు ఆ లోహపు వస్తువును బలంగా ఢీకొనడంతోనే పట్టాలు తప్పినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, కుట్ర కోణంతో సహా అన్ని అంశాలను లోతుగా విచారించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : నేపాల్ విధ్వంసం.. ఏసియా కప్‌నకు క్వాలిఫై!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>