నేపాల్ విధ్వంసం.. ఏసియా కప్‌నకు క్వాలిఫై!

కలం, స్పోర్ట్స్ : మలేషియాలోని బయూమాస్ ఓవల్ మైదానంలో శనివారం జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్ (ACC Premier Cup) ఫైనల్లో నేపాల్ అద్భుత విజయం సాధించింది. యూఏఈని 44 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌లో జరిగే 2027 వన్డే ఏసియా కప్‌నకు నేపాల్ అర్హత సాధించింది. టాస్ గెలిచిన నేపాల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 313 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 102 పరుగులతో చెలరేగాడు. ఆఖర్లో గుల్షన్ ఝా 52 పరుగులతో మెరుపులు మెరిపించాడు.

అర్జున్ కుమాల్ 43 పరుగులు, రోహిత్ కుమార్ పౌడెల్ 40 పరుగులు చేశారు. యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 49.1 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈ బ్యాటర్ రాహుల్ చోప్రా 100 పరుగులతో ఆఖరి వరకు పోరాడాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. షోయబ్ ఖాన్ 52 పరుగులు చేశాడు. నేపాల్ బౌలర్ కరణ్ కేసీ 3 వికెట్లు, లలిత్ నారాయణ్ రాజ్‌బంశీ 2 వికెట్లు తీశారు. గతంలో 2023లో కూడా నేపాల్ ఏసియా కప్‌నకు క్వాలిఫై అయింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఏసియా కప్ బెర్తును ఖాయం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>