పామాయిల్ గెలల దొంగతనాలపై పోలీసుల నిఘా..!

​కలం, దమ్మపేట : పామాయిల్ పంట రైతులకు అత్యంత కీలకమైన F-Code వివరాలను ఇతరులతో పంచుకుంటే భారీగా నష్టపోయే ప్రమాదముందని పోలీసులు హెచ్చరించారు. గెలల దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  పామాయిల్ గెలల చోరీలకు చెక్ పెట్టేందుకు రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. F-Code దుర్వినియోగం కాకుండా రైతులు కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట రవాణా మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నమ్మకమైన డ్రైవర్లను మాత్రమే రవాణాకు నియమించుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రివేళల్లో అనుమానాస్పద రీతిలో గెలల లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

​పోలీసులు, రైతులు, ఫ్యాక్టరీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చోరీలను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో దమ్మపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల ప్రతినిధులు, టీజీ ఆయిల్ ఫెడ్ ప్రతినిధులు నాగబాబు, వెంకటేష్, శంకర్, కార్తీక్, పాకలగూడెం కలెక్షన్ ఏజెంట్ పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>