కలం, నాగర్ కర్నూల్ : డిండి లిఫ్టును (Dindi Lift Project) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో సత్యాగ్రహ దీక్ష (Satyagraha Deeksha) చేపట్టారు. ఈ దీక్షలో జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కన్వీనర్ రాఘవాచారి, కోకన్వీనర్, న్యాయవాది బెక్కెం జనార్ధన్, నాగర్ కర్నూల్ ఇన్చార్జి శ్యాం ప్రసాద్ రెడ్డి, జనసేన పార్టీ కన్వీనర్ లక్ష్మణ్ గౌడ్, కల్వకుర్తి జనసాధన కమిటీ అధ్యక్షుడు సదానందం గౌడ్, రామచంద్ర రెడ్డి, జంగయ్య వెంకట్ రెడ్డి ఏంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ గౌడ్, తిమ్మప్ప కార్యకర్తలు చేపట్టారు.
పాలమూరు నీటికి అన్యాయం చేయొద్దు
ఈ సత్యాగ్రహ దీక్ష(Satyagraha Deeksha)లో వ్యక్తులు మాట్లాడుతూ… దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ నీటిని అక్రమంగా నల్గొండకు తరలించేలా డిండి లిఫ్టును రూపకల్పన చేయడం ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేసినట్లే అన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న రాజోలి బండ, కల్వకుర్తి, కోయిల్ సాగర్, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటి హక్కులు కాపాడాలి
పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగంగా చేపట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వెంటనే నిర్మించాలని, అచ్చంపేటలోని చంద్రసాగర్, అమ్రాబాద్ లిఫ్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని, తెలంగాణ సరిహద్దు దగ్గర బచావత్ క్రిమినల్ తీర్పు ప్రకారం తెలంగాణ వాటా నీరు సాధించాలని, కృష్ణానది, భీమా ప్రాజెక్ట్ నదులు కలిసే తంగిడి గ్రామ సమీపంలో తెలంగాణ సాగునీటి హక్కులు కాపాడే విధంగా ఒక భారీ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో రిటైర్డ్ ఉద్యోగులు, ఎర్రవెల్లి ఇతర గ్రామాల ప్రజలు పాల్గొని సంఘీభావాన్ని, సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం శశిధర్ రెడ్డి పాల్గొని తన మద్దతు తెలియజేశారు.
Also Read : గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

