కొండా సురేఖకు మీనాక్షి ఫోన్.. కీలక సూచన!

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించిన మీనాక్షి.. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని కొండా సురేఖను అడిగారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంపై ఆరా తీశారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. పార్టీకి దూరంగా ఉండొద్దని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరినట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం.

పార్టీ మారొద్దని..

కొండా సురేఖకు ఫోన్ చేసిన మీనాక్షి నటరాజన్ పార్టీ మార్పు ఆలోచనలు చేయొద్దని కూడా సూచించినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవలే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడంతో సురేఖ తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. అందుకే, అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం లేదని తెలుస్తోంది. మీనాక్షి స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించిన నేపథ్యంలో కొండా సురేఖ (Konda Surekha) ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : కంది వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నియామకాల్లో అవకతవకల ఆరోపణలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>