నేటి నుంచి బ్రిక్స్ సదస్సు ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో నేటి నుంచి 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) జరగబోతుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో 11 మంది దేశాధినేతలు పాల్గొనబోతున్నారు. ఈ మేరకు భారత్ మండపంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈసారి బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల కూటమిని ‘బ్రిక్స్’ కూటమిగా వ్యవహరిస్తుంటారు. మరో ఆరు దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉన్నాయి. 2025 సదస్సు బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో జరిగింది.

వివిధ దేశాల అధ్యక్షుల రాక..

బ్రిక్స్ సదస్సు(BRICS Summit)లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం దేశ రాజధానికి వచ్చిన పుతిన్‌తో ప్రధాని మోదీ సుమారు గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రష్యా పర్యటనకు రావాలని ప్రధాని మోదీని కోరగా.. అంగీకరించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో సమావేశమయ్యారు. ఈ రోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ భారత్ రాబోతున్నారు.

Also Read : తెలంగాణ భవన్‌లో నేడు బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>