జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి: జర్నలిస్ట్స్ యూనియన్

కలం, నల్లగొండ: అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ-IJU) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వారి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పేర్కొంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట రెండు రోజుల పాటు ‘రిలే నిరాహార దీక్షలు’ చేపట్టాలని యూనియన్ నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం స్థానిక డీఎస్పీ కె. శివరాంరెడ్డిని యూనియన్ నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు.

యూనియన్ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు డీఎస్పీని కలిసి దీక్షల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. సమాజానికి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు.

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే జర్నలిస్టుల ఇతర ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళనా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా, డివిజన్ స్థాయి యూనియన్ నాయకులు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>