సర్వోదయ మండల్‌ ఆధ్వర్యంలో వినోబా భావే జయంతి వేడుకలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : దేశంలో జరిగిన భూదానోద్యమం ఒక్క రక్తపు చుక్క రాలకుండా జరిగిన గొప్ప రక్తరహిత విప్లవం అంటూ సర్వోదయ మండల్ జిల్లా అధ్యక్షులు జి. సత్యనారాయణ రెడ్డి (Satyanarayana Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో భూదాన్ ఉద్యమ సృష్టికర్త ఆచార్య వినో బాభావే (Vinoba Bhave) 131వ జన్మదిన వేడుకలు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వినోబా భావే సర్వోదయ మండల్‌లో పనిచేస్తూ దేశంలో మొదటగా ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో 1951 ఏప్రిల్ 18న పోచంపల్లి గ్రామంలో వేదిరే రామచంద్రారెడ్డి ద్వారా భూమిని దానంగా తీసుకొని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేసిన మహానుభావుడు కొనియాడారు.

పోచంపల్లి నుంచే భూదానోద్యమానికి శ్రీకారం

ఇక్కడి నుండి ప్రారంభమైన భూదాన ఉద్యమం (Bhoodan Movement) భారతదేశం మొత్తం 14 సంవత్సరాలు పాదయాత్ర చేసి 46 లక్షల పై ఎకరాలను సేకరించి భూమి లేని, ఇల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 1965 లో చట్టబద్ధ భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేశారు. ఒక రక్తపు బొట్టు చిందకుండా నడిపిన ఈ ఉద్యమాన్ని రక్త రహిత విప్లవం అని కూడా అంటారన్నారు. అట్టి భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.

భూదాన్‌ భూములను కాపాడాలి

భూదాన్ ఉద్యమానికి జాతీయస్థాయిలో సర్వ సేవా సంఘం, రాష్ట్రస్థాయిలో సర్వోదయ మండల్‌లను వినోబా భావే నామినిగా 1973లో ప్రకటించారని ఆయన తెలిపారు. అందువల్ల భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయవలసిన అర్హత, బాధ్యత మన సర్వోదయ మండల్ పై ఉన్నదనీ, కనుక భూదాన్ భూములను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.సుందర్ రాజ్ సహాయ కార్యదర్శి, పి. శివకుమార్ కోశాధికారి, బి.బాలరాజ్, కె.స్వాతి, కట్ట నరసింహ, ఆసిఫ్ ఖాన్, సి.కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>