నిజామాబాద్‌లో విషాదం.. గుర్తుతెలియని హిజ్రా మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో గుర్తుతెలియని హిజ్రా మృతి చెందారు. సుమారు 40 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో సెప్టెంబర్ 8న నిజామాబాద్  ప్రభుత్వ ఆసుపత్రిలో(Govt Hospital) చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు కొన్ని ఆనవాళ్లను వెల్లడించారు. కుడి చేతిపై ‘అమ్మ’ అనే పచ్చబొట్టు ఉంది. ఎడమ చేతిపై రెండు ‘M’ గుర్తులతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి. మృతురాలి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. అలాగే 8712659714 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>