అమరవీరుల కుటుంబాలకు టీజీ వీర్ ఫ్యామిలీ కార్డులు

కలం, నిర్మల్ : పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అందించే సంక్షేమ ప్రయోజనాలు సులభంగా చేరేలా టీజీ వీర్ ఫ్యామిలీ కార్డులు (TG Veer Family Cards) అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలకు కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు.

ఈ కార్డుల (Veer Family Cards) ద్వారా ఆర్థిక సహాయం, పింఛన్లు, కారుణ్య నియామకాలు, ప్లాట్ లేదా ఇంటి స్థల కేటాయింపులు తదితర సంక్షేమ ప్రయోజనాల వివరాలను నమోదు చేయడంతో పాటు వాటి పురోగతిని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అన్నారు.

వారి కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అర్హతగల ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : దులీప్ ట్రోఫీ విజయం వెనుక ఎంఎస్ ధోనీ హస్తం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>