ప్రముఖ నిర్మాత కంపెనీపై ఈడీ దాడులు

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్ రెడ్డి (Mahesh Reddy)కి చెందిన ఏఎంఆర్ కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, కోల్‌కతా, రాంచీ నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. కోల్‌కతాలో బొగ్గు కుంభకోణం కేసుకి సంబంధించి దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లోని ఏఎంఆర్ కంపెనీలపై ఒకేసారి దాడులు చేపట్టారు. కంపెనీ సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతగా ఉన్న మహేశ్ రెడ్డి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కొంత మందికి బినామీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>