కలం, స్పోర్ట్స్ : 2027 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడతాడా? ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆసక్తికర సమాధానం వచ్చింది. తన వరల్డ్ కప్ ఎంపికపై రోహిత్ తొలిసారి స్పందించాడు. 2027 అక్టోబర్ ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటివరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని స్పష్టం చేశాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్‌ను ఈ ప్రశ్న అడిగారు. దానికి ఆయన క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి నిర్వహించనున్నాయి. భారత్ ఆ టోర్నీ గెలిస్తే 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ముంబైలో జరిగినట్టుగా ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందా అని కూడా రోహిత్‌ను అడిగారు.
అయితే ఇప్పుడు అలాంటి బస్ పరేడ్ సాధ్యమవుతుందో, లేదో అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు రోహిత్ ఫామ్‌పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలో స్పష్టత ఇచ్చారు. రోహిత్ (Rohit Sharma) అన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పారు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రోహిత్ 138 పరుగులు చేశాడని సైకియా గుర్తుచేశారు. అతను బాగా ఆడుతున్నప్పుడు వరల్డ్ కప్ ఎంపికపై ఇంత చర్చ ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ప్రస్తుతం రోహిత్ టెస్టులు, టీ20లు ఆడటం లేదు. దీంతో వన్డేల్లో అతని భవిష్యత్తుపై చర్చ కొనసాగుతోంది. అయితే 2027 వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉండటంతో, రోహిత్ భవిష్యత్తుపై తుది నిర్ణయం అప్పటి పరిస్థితులపైనే ఆధారపడే అవకాశం ఉంది.
Also Read : గుర్నూర్ బ్రార్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వాలి: ఆకాశ్ చోప్రా
Follow Us On: X(Twitter)

