కలం, జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు (Shetty Atmakur) గ్రామంలో కరెంట్ తీగలతో ప్రమాదం పొంచి ఉండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శెట్టి ఆత్మకూరు గ్రామంలో విద్యుత్ తీగలు (Electric wires) ఇండ్లకు ఆనుకొని పోవడంతో ఇండ్లపై ప్రమాదకరంగా తీగలు వేలాడుతున్నాయి. అంతే కాకుండా కరెంట్ తీగలు చేతికందేలా వేలాడుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
వెంటనే సమస్య పరిష్కరించాలి
ఈ విషయాన్ని పట్టించుకోవలసిన విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చూస్తున్నారు తప్పితే ఎలాంటి పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వైర్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

