కాల్వతండాలో వైభవంగా తీజ్‌ ఉత్సవాలు

కలం, దిలావర్‌పూర్ :  లంబాడా గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలకు అద్దం పట్టే తీజ్‌ ఉత్సవాల వేడుకలను (Teej Festival) దిలావర్‌పూర్ మండలం కాల్వతండాలో(Kalwa Thanda) కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా పుట్టమట్టిలో గోధుమలు, ఇతర ధాన్యాలను విత్తి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం గురువారం తీజ్‌ ఉత్సవాలను వైభవంగా ముగించారు.

రంగురంగుల సంప్రదాయ దుస్తులలో ముస్తాబైన యువతులు, మహిళలు ఆటపాటలు, సాంస్కృతిక నృత్యాలతో సందడి చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. దీంతో కాల్వతండా అంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల వైభవంతో కళకళలాడింది. ముఖ్యంగా తీజ్‌ ఉత్సవాల్లో కీలక పాత్ర పోషించే గ్రామంలోని యువతులు మంచి జీవిత భాగస్వామి లభించి, భవిష్యత్‌ జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్‌ జాదవ్‌ ప్రేమ్‌ నాయక్‌, సుదర్శన్‌ గ్రామ పెద్దలు, యువతులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>