పొంగులేటి నియోజకవర్గంలో కరెంట్ కష్టాలు: రోడ్డెక్కిన పాలేరు రైతులు!

కలం, ఖమ్మం బ్యూరో : వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాలో తీవ్ర కోతలు విధిస్తుండటంతో ఖమ్మం (Khammam) జిల్లా పాలేరు (Paleru) నియోజకవర్గంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) సొంత నియోజకవర్గమైన పాలేరు పరిధిలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నిరంతరం కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు నేలకొండపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి గురువారం భారీ రాస్తారోకో (Farmers Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ కోతలకు నిరసనగా స్థానిక ప్రజాప్రతినిధి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా రైతాంగం పెద్దఎత్తున నినాదాలు చేశారు.

​మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా నినాదాలు

పక్కనే ఉన్న మధిర నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే, నేలకొండపల్లి మండలానికి వచ్చేసరికి రోజుకు కేవలం 6 నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వడంపై అధికారుల పక్షపాత ధోరణిని రైతులు తీవ్రంగా తప్పుబట్టారు. స్వయంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి విద్యుత్ కష్టాలు ఎదురవ్వడంపై ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు, ఈ వ్యత్యాసానికి మంత్రి పొంగులేటి స్పందించి తక్షణమే స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన

సరైన సమయంలో, అవసరమైనంత కరెంట్ అందకపోవడం వల్ల పొలాలకు సరిపడా నీరు అందక బోర్ల కింద సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. విద్యుత్ లైన్ లాస్‌ల పేరు చెప్పి వ్యవసాయ రంగానికి కోతలు విధించడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు. తమకు కూడా మిగతా ప్రాంతాల మాదిరిగానే 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. రైతుల నిరసనతో రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>