పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

కలం, వెబ్ డెస్క్​ : అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని బాటసింగారం (Batasingaram) వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం (TGSRTC Bus Accident) సృష్టించింది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న ఒక పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాద ధాటికి పెట్రోల్ బంక్ ప్రాంగణంలో నిలిపి ఉన్న రెండు కార్లు, ఒక ఆటో ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బంకు వద్ద పెద్దగా జనం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు బంకులోకి దూసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల సాంకేతిక లోపాలు లేదా డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>