కార్యకర్తల భేటీలో మాజీ మంత్రి భావోద్వేగం

కలం, వెబ్ డెస్క్​ : విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఈ భేటీలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) భావోద్వేగానికి గురయ్యారు.

జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో గడిపిన రోజులను, కలిసి సాగించిన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నాయకులు ప్రసంగించారు. ఈ క్రమంలో వారితో పాటు వేదికపై ఉన్న బొత్స సత్యనారాయణ కూడా చలించిపోయి, మాట్లాడే క్రమంలో కంటతడి పెట్టారు. మజ్జి శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>