కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) రూరల్ మండలంలోని మల్లారం, మాలపల్లి ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాలపల్లిలో ఉన్న ఓ అక్వేరియం, పెట్ దుకాణంలో అక్రమంగా ఉంచి విక్రయించేందుకు (Illegal Bird Trade) ప్రయత్నిస్తున్న 98 రకాల పక్షులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్ కలీం, సయ్యద్ బిన్ ఖాలీద్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పక్షులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై విచారణ చేపట్టారు.

