మెగా డీఎస్సీలో లెక్కలేని అక్రమాలు: జగన్

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో లెక్కలేని అక్రమాలు వెలుగు చూస్తున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ఎవరైనా అక్రమాలను బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తే.. వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్‌ఈఆర్టీలో పనిచేసే నవీన్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుందని, ఒకవేళ వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎందుకు నవీన్ ఐడీని బ్లాక్ చేశారని వివరించారు.

తనను వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదని నవీన్ విద్యా శాఖ అధికారులకు లేఖ కూడా రాశాడని వైఎస్ జగన్ గుర్తు చేశారు. సమాధానం లేకపోయేసరికి కోర్టును ఆశ్రయించాడని జగన్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందనడానికి ఇదే పెద్ద ఉదహరణ అన్నారు. ఎలాంటి తప్పులు చేయలేకపోతే నవీన్ ఫస్ట్ ర్యాంకుతో వచ్చిన మెరిట్ లిస్ట్‌ను రాత్రికి రాత్రే ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

పరీక్ష లేకుండానే వారికి ఉద్యోగాలు..

స్పోర్ట్స్ కోటాలో మరో పెద్ద స్కాం జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఎలాంటి పరీక్ష లేకుండానే జీవో నెం.4, 47ల ద్వారా ఏకంగా 372 మందికి అక్రమంగా కొలువులు ఇచ్చేశారని విమర్శించారు. తీరా 372 మందికి ఉద్యోగాలు ఇచ్చేశాక.. మళ్లీ కొత్త జీవో 23, 25, 56ల ద్వారా పరీక్ష నిర్వహించి తీసుకోవాలని చెప్పారని వివరించారు. ఒక రిక్రూట్మెంట్‌కు ఇన్ని రకాల జీవోలతో తమకు కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇచ్చి పెద్ద స్కాంకు తెరదీశారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>