ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై పోరు.. బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్ట్!

కలం, నిర్మల్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను (Fee reimbursement dues) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు (BRSV Leaders Arrested) చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు మిర్జా షాయబ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం అన్యాయమని విమర్శించారు. విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే బకాయిలను విడుదల చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>