కలం, సోన్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామం వద్ద NH-44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం.. హుజూర్‌నగర్ నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ బుధవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కడ్తాల్ గ్రామం వద్ద ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. లారీలోని సిమెంట్ బస్తాలు రహదారిపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గురువారం ఉదయం అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిన సిమెంట్ బస్తాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

