కలం, వెబ్ డెస్క్: క్షుద్ర పూజలు చేశారంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao)పై బహిరంగంగా నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
సదరు ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై స్పష్టతనిస్తూ నాలుగు వారాల్లోగా ప్రాథమిక “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది. హరీష్‌రావుపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

