అగ్ని ప్రమాదానికి గురైన స్కూల్ బస్.. తల్లిదండ్రులు ఆందోళన

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని మంతన్ స్కూల్ లో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మంగళవారం పాఠశాలకు చెందిన బస్సు అగ్ని ప్రమాదానికి (School Bus Fire Accident) గురైన నేపథ్యంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళన చేశారు. నాన్ ఏసీ బస్సును ఏసీగా ఎలా మార్చారు అంటూ పాఠశాల నిర్వాహకులను నిలదీశారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ విద్యార్థులను ప్రమాదాల్లోకి నెట్టడం ఏంటని అని నిలదీశారు. దీంతో కొల్లూరు సీఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

ఎంఈఓ భాస్కర్ పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పాఠశాలకు నోటీసు ఇస్తామని తెలిపారు. రవాణా శాఖ ఎంవిఐలు గౌతమ్, రాజు పాఠశాలను సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ చేస్తామని ప్రమాదాని కారణాలేమిటో వెల్లడిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పిల్లలకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>