ఆదిలాబాద్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

కలం, ఆదిలాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (Kaloji Narayana Rao Jayanti) వేడుకలను బుధవారం ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని పెన్‌గంగా భవన్‌లో ఉన్న అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో పాటు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో తెలంగాణ యాసలో కవితలు రచించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. తెలంగాణ సమాజానికి, భాషకు కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆయనకు దక్కిన గౌరవమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. కాళోజీ రచనలు, ప్రజా చైతన్యానికి చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, ఏవో వర్ణ రెవెన్యూతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>