అంతరిక్షంలో ఆ సదుపాయం లేదు: సునీతా విలియమ్స్

కలం, వెబ్ డెస్క్​: భూమిపైన ఉండే సులువైన సదుపాయాలు అంతరిక్షంలో ఉండవని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తెలిపారు. భూమిపై ప్రతి ఒక్కరి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చని, అయితే అంతరిక్ష కేంద్రంలో (ISS) అటువంటి డేటాబేస్ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు.

అక్కడ ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా భూమిపై ఉన్న కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై కమ్యూనికేట్ చేయాల్సిందేనని అన్నారు. భవిష్యత్తులో వచ్చే అంతరిక్ష కేంద్రాల్లో ఇటువంటి సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనితో పాటు అంతరిక్షంలో 3డి ప్రింటింగ్, సాధారణ పేపర్ ప్రింటింగ్ చేయడం ఎంతో కష్టతరమని, ఎందుకంటే భూమిపై ఉన్న యంత్రాలన్నీ గురుత్వాకర్షణ శక్తి ప్రాతిపదికన పనిచేస్తాయని వివరించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణంలో యంత్రాలు ఎలా పనిచేయాలో సరికొత్త పరిజ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>