కాళోజీ సాహిత్యం.. ప్రజా చైతన్యానికి చిరునామా: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తన కవితల ద్వారా ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజీ నారాయణరావు అని జిల్లా ఎస్పీ డి.జానకి (SP Janaki) కొనియాడారు. తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో (Mahabubnagar Police) బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రజల గొంతుకగా కాళోజీ..

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకువచ్చిన గొప్ప ప్రజాకవి అని అన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలను తన సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అన్యాయం, అసమానతలు, సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన కాళోజీ (Kaloji Narayana Rao) ఆలోచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని ఎస్పీ కొనియాడారు.

ప్రజాసేవే ఆశయంగా ముందుకు..

ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం వంటి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కాళోజీ నారాయణరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్,  డీసీఆర్ బీడీఎస్పీ రమణా రెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, అశోక్ కుమార్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొని కాళోజీకి నివాళులు అర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>