అలంపూర్ శాంతినగర్‌లో వైభవంగా శివలింగ పునః ప్రతిష్ట.. భక్తుల సందడి

కలం, అలంపూర్ : అలంపూర్ (Alampur) నియోజకవర్గ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పట్టణంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ(Sri Dattatreya Temple) సమూహంలో గల శివాలయంలో శివలింగ పునః ప్రతిష్టాపన (Shiva Lingam Reinstallation) మహోత్సవం బుధవారం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన పురోహితులు భాస్కరాచారి ఆధ్వర్యంలో సహా పురోహితులు పత్తికొండ వాస్తవ్యులు శంకర శర్మ, జయదేవ్ ప్రతిష్టాపనపూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ

ఈ నేపథ్యంలో గణపతి పూజ పుణ్యాహ వాచనం, కంకణ ధారణ ,పంచగవ్యమేళనం, నాంది ,నవగ్రహారాధన, వాస్తు ఆరాధన, ప్రధాన కలశ స్థాపన నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామికి విశేష ద్రవ్యములతో అభిషేకం, నవగ్రహ వాస్తు హోమాలు, ప్రధాన కాశీ విశ్వేశ్వర రుద్ర హోమం, ఘర్తన్యాసం, యంత్రస్థాపన ,విగ్రహ ప్రతిష్ట పూర్ణాహుతి ఉద్వాసన, ప్రాణప్రతిష్ట ,మహాబలి విధానం జ్వాలా దర్శనములు జరిగాయి.

భక్తులకు అన్నదానం

మహా మంగళహారతి, మంత్రపుష్పం, అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం నిర్వాహణ కర్తగా ఆలయ సేవకుడు సావిత్రి ,పకీరప్ప దంపతులు, వారి కుమార్తెలు ఈ మహోత్సవం లో పాల్గొన్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు కోడి వెంకటేశ్వర్లు, గో ప్రచార సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఇటుకూరి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు రామచంద్రుడు, కృష్ణమాచారి దంపతులు,బిజెపి సభ్యులు మోహన్, శివకుమార్ ,రాజశేఖర్, రాజోలి వెంకటేశ్వర్లు, పల్లె ఆంజనేయస్వామి సేవకుడు నాగరాజు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>