నాయర్ ఫైర్.. సౌత్ జోన్‌పై గట్టి పంచ్!

కలం, స్పోర్ట్స్ : దులీప్ ట్రోఫీ (Duleep Trophy) ఫైనల్లో కరుణ్ నాయర్‌ (Karun Nair) కు చోటు దక్కకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. సెమీఫైనల్ తర్వాత ఫైనల్లోనూ అతడిని సౌత్ జోన్ పక్కన పెట్టింది. దీంతో నాయర్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని బయటపెట్టాడు. సౌత్ జోన్ జట్టులో ఉన్న నాయర్.. నార్త్ జోన్‌తో సెమీఫైనల్లోనూ ఆడలేదు. ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లోనూ ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించలేదు. నాయర్‌ను పక్కన పెట్టడంపై ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రశ్నలు వచ్చాయి. దీనికి నాయర్ స్పందిస్తూ.. ‘అర్థం కానిది’ అనడం కూడా తక్కువేనని పేర్కొన్నాడు.

ఇక సెమీఫైనల్‌లో నాయర్‌ను ఎందుకు ఆడించలేదన్న దానిపై కెప్టెన్ తిలక్ వర్మ గతంలో వివరణ ఇచ్చాడు. జట్టు కూర్పు దృష్ట్యా ఎడమచేతి వాటం బ్యాటర్ కోడిమెల హిమతేజను ఎంపిక చేసినట్లు తెలిపాడు. అయితే హిమతేజకు ఆ అవకాశం కలిసిరాలేదు. అతడు రెండు బంతుల్లోనే డకౌట్ అయ్యాడు. ఫైనల్లో అతడిని తప్పించారు. కానీ నాయర్‌కు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను తీసుకున్నారు. ఫైనల్లో సౌత్ జోన్ బౌలింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఈస్ట్ జోన్ ఏకంగా 708 పరుగులకు ఆలౌటైంది. కుమార్ కుషాగ్ర 101 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. అతడు 270 పరుగులు చేసి ఔటయ్యాడు. ట్రిపుల్ సెంచరీకి 30 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఈ భారీ స్కోరుతో ఈస్ట్ జోన్ మ్యాచ్‌లో పట్టు సాధించింది. ఇదే సమయంలో కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టిన నిర్ణయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం నాయర్ స్పందన, సౌత్ జోన్ నిర్ణయం రెండూ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>