కలం యాదగిరిగుట్ట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Yadadri Collector) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 77 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 53, సర్వే ల్యాండ్స్ 5, శిశు సంక్షేమ 5, మున్సిపాలిటీ 3, డీపీఓ 2 పీడీ హోసింగ్ 2, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్య, మైన్స్, మత్య, విద్యుత్, లీడ్ బ్యాంకు, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ప్రత్యేక అధికారులు హాస్టల్ ఇన్స్పెక్షన్ తప్పనిసరిగా చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు.
అలాగే ‘మీ ప్రమాణం’లో నమోదు చేసుకొని అధికారులు, సిబ్బంది నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకొని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికపుడు డిస్పోస్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, డిప్యూటీ కలెక్టర్ కృతిక, జెడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ అలివేలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

