ఆ పాఠశాలల్లో ఏఐపై నిషేధం!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా న్యూయార్క్ సిటీ తమ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని నిషేధించింది (AI Ban). విద్యార్థులకు మానవ సంబంధాలు, ఉపాధ్యాయుల తోడ్పాటు అత్యంత ముఖ్యమని న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు.

ప్రారంభ విద్యా దశలో ఏఐ సాంకేతికత వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నిరూపించే ఎలాంటి పరిశోధనలు లేవని, కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ఏఐ అవసరమనే ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు స్వయంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించడం, తోటివారితో సంబంధాలను పెంపొందించుకోవడం నేర్చుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో 2-K నుండి ఎనిమిదవ తరగతి వరకు జనరేటివ్ ఏఐ వినియోగంపై ఒక ఏడాది పాటు నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>