వైఎస్సార్ వర్ధంతి.. ఘనంగా అన్నదాన కార్యక్రమం

కలం, కరీంనగర్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ (Karimnagar) నగరంలోని 56వ డివిజన్‌లో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ అభిమాని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల సురేష్, 56వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు జాగిరి సాగర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సేవలు చిరస్మరణీయం..

ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, పేద ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగాలని సూచించారు. వైఎస్సార్ జయంతి (YSR Death Anniversary)ని పురస్కరించుకొని ప్రజలకు అన్నదానం చేయడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నామని నల్ల సురేష్, జాగిరి సాగర్ తెలిపారు. ప్రజా సేవే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ పాడిశెట్టి భూమన్న, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు రేగొండ సందీప్, మార్కరాజు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆమీర్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రాన్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫర్హాద్, యూత్ కాంగ్రెస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్ర రాహుల్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>