కలం, నాగర్ కర్నూల్: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా ఇంచార్జి మోక్తల శాంతన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని మోక్తల శాంతన్ కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర రెడ్డికి వినతి పత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

