కలం, కరీంనగర్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని (Karimnagar) తెలంగాణ చౌక్‌లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి కార్యకర్తలు, నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజాసేవ, స్వచ్ఛంద కార్యక్రమాలలో నిరంతరం ముందుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభం:
ఈ వేడుకల్లో భాగంగా నగరంలోని 45వ డివిజన్లో జనసేన (Janasena) కంటెస్టెడ్ కార్పొరేటర్ జంగ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కందుల రాజిరెడ్డి, కాస రాజు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగ మహేష్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా సేవ, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు జనసేన టికెట్ ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు.
రక్తదాన శిబిరానికి విశేష స్పందన:
నగరంలోని ఆయుష్ బ్లడ్ బ్యాంక్‌లో గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కందుల రాజిరెడ్డి, కాస రాజు పటేల్, ఉత్తర తెలంగాణ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ మిడిదొడ్డి కపిల్ మాధవ్‌లు కలిసి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్‌ను భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనేదే తమ అభిలాష అని, ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు పొన్నాల తిరుపతి, వీర్ల శ్రీనివాసరావు, గాలిపెల్లి కుమార్, జంగ మహేష్, అంబల సృజన్ కుమార్, పాతూరి వేణుగోపాల్ రెడ్డి, భీం రెడ్డి, మహాదేవుని రాజకుమార్, అనిల్, సుజాత, శిరీష, సంతోష్, లక్ష్మణ్, వినయ్, శ్రీనివాస్, సూరి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

