హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన షెడ్లు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో (Madannapet Market) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్కెట్‌లోని పలు షెడ్లు మంటల్లో చిక్కుకున్నాయి. భారీగా పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా, మంటల తీవ్రతకు మార్కెట్‌లోని షెడ్లు భారీగా దెబ్బతిన్నాయి. షెడ్లలో ఉన్న కూరగాయలు, ఇతర సామగ్రి కూడా మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్‌సర్క్యూట్ కారణమా? మరేదైనా కారణమా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదిలాఉంటే మాదన్నపేట్ మార్కెట్(Madannapet Market) లో అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి అని స్థానికులు అంటున్నారు. గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగినా మార్కెట్ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టడం లేదని వ్యాపారస్తులు, స్థానికులు ఫైర్ అవుతున్నారు.

Also Read : యూఎస్‌లో తెలుగు వారి కథ: షాకింగ్ వీడియో వైరల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>