కలం, వెబ్ డెస్క్ : ఖమ్మంకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజు (Gunti Nagaraju)కు కొందరు ఆకతాయిల వల్ల వింత అనుభవం ఎదురైంది. కొందరు ఫాలోవర్లు కావాలని ఆయన ఇంటికి సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) పద్ధతిలో ఫుడ్ ఆర్డర్లు పెడుతూ వేధిస్తున్నారు.
ఫుడ్ ఆర్డర్లు వరుసగా తన ఇంటికి వస్తుండటంతో నాగరాజు ఇబ్బంది పడుతున్నాడు. దుర్గామాత పూజలో ఉన్న సమయంలో ఇలాంటి ఆహారాన్ని పంపడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ దయచేసి తన పేరిట ఎలాంటి ఆర్డర్లు పెట్టవద్దని వేడుకున్నాడు. గతంలో తమిళనాడులోనూ ఓ ఇన్ఫ్లుయెన్సర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురుకావడంతో అతడు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణకు చెందిన నాగరాజుకు కూడా అదే తరహా సమస్య రావడం గమనార్హం.

