కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కావడానికి ఆమె అపాయింట్‌మెంట్ కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మంత్రి విజ్ఞప్తిపై స్పందించిన కేసీ వేణుగోపాల్, స్వయంగా ఢిల్లీ వచ్చి కలవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నుంచి పిలుపు రావడంతో కొండా సురేఖ అత్యవసరంగా రాజధానికి బయలుదేరారు. పార్టీ అంతర్గత పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : కేసీఆర్ చెప్పినా కవిత వినలేదు: ప్రశాంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

