నా జీవితాన్ని న‌రకంగా మార్చాడు.. మోదీపై రుచిక మ‌రో వీడియో!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన జెన్ జీ ప్రొటెస్ట్‌లో ప్ర‌ధాని మోదీ (PM Modi) పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి వైర‌ల్ అయిన రుచిక సింగ్ (Ruchika Singh) మ‌రో వీడియో విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా మోదీపై రుచిక తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాని మోదీ త‌న జీవితాన్ని న‌ర‌క‌ప్రాయం చేశార‌ని, తాను ఎక్క‌డ ముఖం చూపించ‌లేక‌పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న‌పై సోష‌ల్ మీడియా, నిజ జీవితంలో తీవ్ర వేధింపులు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొంది. ఇక త‌న‌కు కోల్పోవ‌డానికి ఏమీ మిగ‌ల్లేద‌ని, తాను వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఢిల్లీలో రుచిక మోదీపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారి తీయ‌డంతో ఆమె ప్ర‌ధానికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్తూ గ‌తంలోనే వీడియో విడుద‌ల చేసింది. అయితే ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ త‌న ఇంటికి మీడియా, పోలీసులు వ‌స్తూనే ఉన్నార‌ని చెప్పింది. అలాగే బీజేపీ మ‌ద్ద‌తుదారుల నుంచి త‌న‌తో పాటు త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు వేధింపులు కూడా తీవ్ర‌మ‌య్యాయ‌ని తెలిపింది. ఇక రుచికకు కొంద‌రు సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా, మ‌రికొంద‌రు ఆమె తీరును విమ‌ర్శిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>