కలం, నిర్మల్ : ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని కేరళ స్కూల్ లో బుధవారం ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రానికి, ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ఉంటాయని అన్నారు. కేరళకు ఎంతో ప్రత్యేకమైన ఓనం పండుగను ఖానాపూర్ లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఓనం పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం ఘనంగా ఓనం వేడుకలు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే అభినందించారు.

