నేపాల్‌లో జల ప్రళయం.. 105 మంది భారతీయులు గల్లంతు!

కలం, వెబ్ డెస్క్ : నేపాల్‌ (Nepal Flood) దేశంలో వరద భీభత్సం సృష్టిస్తోంది. భోటేకోశీ నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచెత్తింతి. ఉప్పొంగిన వరద ధాటికి పలు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా.. 291 మంది పర్యాటకులు గల్లంతయయారు. ఇందులో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రకటించింది.

వరద సృష్టించిన బీభత్సానికి టిబెట్ లో కొండచరియలు విరిగపడ్డాయి. దీని వల్ల ముఖ్యంగా రసువా జిల్లాలో అపారనష్టం జరిగింది. పలు జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్ సైన్యం హెలికాఫ్టర్లలో చక్కర్లు కొడుతూ బాధితులకు సాయం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>