తిరుపతిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భవనాలు ఆకస్మాత్తుగా కూలిపోతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. తిరుపతి(Tirupathi )లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎమ్మార్ పల్లి వాణి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

భవనం పక్కన ఉన్న కొత్త భవనం నిర్మాణం కోసం గుంతలు తీస్తుండగా ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రెస్య్కూ టీమ్ ప్రమాద స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది. శిథిలాల కింద ఇంక ఎవరై‌‌నా ఉన్నారా? అనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>