చేయూత పెన్షన్లకు వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఏ జిల్లాలో ఎన్నంటే?

కలం, తెలంగాణ బ్యూరో: చేయూత పథకం కింద పెన్షన్ల (Cheyutha Pension)  కోసం సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,76,451 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వితంతు పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో వితంతు పింఛన్ దరఖాస్తులు 1,80,915 ఉండగా.. దివ్యాంగుల కేటగిరీలో 70,493 మంది, గీత కార్మికులు 12,854, ఒంటరి మహిళలు 7,569, నేత కార్మికులు 4,620 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని?

జిల్లాల వారీగా చూస్తే 16,202 దరఖాస్తులతో నల్లగొండ మొదటి స్థానంలో ఉంది. ఇందులో 8,964 వితంతు, 283 ఒంటరి మహిళలు, 5,073 దివ్యాంగులు, 436 నేత కార్మికులు, 1,446 గీత కార్మికుల దరఖాస్తులు ఉన్నాయి. 15,068 దరఖాస్తులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ -మల్కాజిగిరి 14,129, రంగారెడ్డి 13,372, ఖమ్మం 12,372, సూర్యాపేట 12,357, కరీంనగర్ 11,526, వికారాబాద్‌ 10,163, నిజామాబాద్‌ 9,754, సంగారెడ్డి 9,532, మెదక్‌ 9,310, యాదాద్రి భువనగిరి 9,260, కామారెడ్డి 8,654, భద్రాద్రి కొత్తగూడెం 8,648 ఉన్నాయి. అత్యల్పంగా ములుగులో 2,559 దరఖాస్తులు వచ్చాయి. వనపర్తిలో 3,985, నిర్మల్‌లో 3,944, ఆసిఫాబాద్‌లో 3,925, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,459 దరఖాస్తులు వచ్చాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>